రానా పెళ్లి.. అందరు ఆహ్వానితులే !
టాలీవుడ్ పెళ్లికానీ ప్రసాదుల్లో రానా దగ్గుపాటి ఒకరు. ఆయన పెళ్లి ఎప్పుడు అనేది తెలీదు. కానీ, ఒకవేళ పెళ్లి చేసుకొంటే మాత్రం అందరినీ ఆహ్వానిస్తా అంటున్నాడు రానా. అంతేకాదు.. నా పెళ్లిని షూట్ చేసి ఓ షోలాగా ప్రసారం చేసుకోండని అనుపతిని కూడా ఇచ్చారు. రానా హోస్ట్ గా వ్యవహరించిన ‘నెం.1 యారీ’ సీజన్ -1 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీజన్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. షో గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘నెం.1 యారీ’ సీజన్ – 2 రానా ఆఫీస్ లోనే జరగనుంది. తొలి అతిథులుగా విజయ్ దేవరకొండ – నాగ్ అశ్విన్ రాబోతున్నారని రానా తెలిపారు. దర్శకుడు నాగ్ అశ్విన్ రానాకి చెడ్డికా దోస్త్ అంట. ఫస్ట్ క్లాస్ నుంచి మేం స్నేహితులం. నేచురల్ స్టార్ నాని నాకు మంచి స్నేహితుడు ఆ విషయం చాలా మందికి తెలీదని తెలిపారు రానా.