‘అంతరిక్షం’ టీజర్ టాక్

‘ఘాజీ’ సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న మరో ప్రయోగాత్మక చిత్రం “అంతరిక్షం”. 9000 కేఎంపీహెచ్‌ అన్నది ట్యాగ్ లైన్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. వరుణ్, అతిథి అండ్ టీం అంతరిక్ష యాత్ర నేపథ్యంలో టీజర్ ని కట్ చేశారు. అక్కడ ఏదో సమస్య తలెత్తడం.. ఉత్కంఠ సన్నివేశం టీజర్ లో చూడొచ్చు.

హై టెక్నికల్‌ వాల్యూస్‌, హాలీవుడ్‌ నిపుణుల సారధ్యంలో యాక్షన్‌ సీన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మేళవింపుతో అంతరిక్షంని రూపొందిస్తున్నారు. ఇందులో అదితి రావ్‌‌ హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం వరుణ్‌, అదితిరావ్‌లను త్రీడీ స్కానింగ్‌ కూడా చేశారని సమాచారం. తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని రీతిలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.