కీర్తికి సావిత్రి పట్టిందట


మహానటి సావిత్రిగా మెప్పించింది.. కీర్తి సురేష్. సాక్షాత్తూ సావిత్రే దిగి వచ్చిందా అన్నంతగా ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ‘మహానటి’తో ఆమె కీర్తి కూడా రెట్టింపైంది. దక్షిణాదిలో మరో స్టార్‌ హీరోయిన్ గా అవతరించిన కీర్తి. ఐతే, కీర్తికి సావిత్రి పట్టిందట. అప్పుడప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఉంటుందట. ‘మా ఇంట్లో మహానటి సావిత్రి జీవిత చరిత్రకి సంబంధించిన పుస్తకాలు, ఫొటోలు చాలా ఉంటాయి. అలా వాటిని చూస్తూ అప్పుడప్పుడు ఆవిడతో మాట్లాడుతుంటా’నని చెబుతుతోంది కీర్తి.

మంచి మనసున్న వ్యక్తి సావిత్రి అమ్మ. డబ్బు ఉన్నప్పుడు అందరూ సాయం చేస్తారు, కానీ లేనప్పుడు కూడా ఆవిడ చేశారు. ఇప్పుడీ అలవాటు కీర్తికి కూడా వచ్చేసింది. సావిత్రి మాదిరిగా కీర్తి తాను నటించిన చిత్రబృందానికి వెండి, బంగారు నాణెలు పంచుతోంది. ఇదివరకు వెండి నాణెలు పంచేదట. మహానటి తర్వాత బంగారు నాణేలు పంచుతుందట. ఇదీగాక, మహానటి తర్వాత కీర్తి కాస్త లావయ్యింది. అచ్చం సావిత్రిలా. చూస్తుంటే.. నిజంగానే కీర్తికి సావిత్రి పట్టినట్టుంది.

ఇక, కీర్తి నటించిన పందెంకోడి 2 దసరా కానుకగా రేపు (గురువారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆమె అల్లరిపిల్లగా కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ లో కీర్తి గడుసుతనం చూశాం. సినిమాలో ఆమె రౌడీ పూర్తి స్థాయిలో చూడొచ్చు. అన్నట్టు నేడు కీర్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.