కేసీఆర్ కాపీ కొట్టారట
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారట. ఏకంగా కాంగ్రెస్ మేనిఫెస్టోని మక్కీకి మక్కీ కాపీకొట్టారని ఆరోపిస్తున్నారు టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ పాక్షిక మేనిఫెస్టోని సీఎం కేసీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అది మరోసారి టీఆర్ఎస్ కు అధికారాన్ని తెచ్చిపెట్టేలా.. జనరంజకంగా ఉంది. రూ. లక్ష రుణమాఫీ, వృద్దులకి ఫించన్ రూ. 2016, వికలాంగుల ఫించన్ రూ. 3016, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగింపు.. హామీలు తెరాస మేనిఫెస్టోలో హైలైగా నిలిచాయి. ఐతే, టీఆర్ఎస్ మేనిఫెస్టో కాపీ. కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ కాపీ కొట్టారని ఆరోపిస్తున్నారు.
కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత గాంధీ భవన్ లో టీ-పీసీసీ చీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. నిస్సిగ్గుగా కాపీ కొట్టారు
మక్కీకి మక్కీ కాంగ్రెస్ మేనిఫెస్టోను దించేశారని కేసీఆర్పై ఉత్తమ్ మండిపడ్డారు. అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్ మేనిఫెస్టోని ఖరారు చేయలేదు. ఏదో గాలి మాటల్లా రాజకీయ సభల్లో అధికారంలోకి వస్తే… అది చేస్తం.. ఇది చేస్తమని హామీ ఇచ్చారంతే. అలాంటప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోని టీఆర్ ఎస్ కాపీ కొట్టినట్టు ఎలా అవుతుందో ఉత్తముడే తెలియాలి. ఇక, ముందస్తుకు వెళ్లి ముందుగానే అభ్యర్థులని ఖరారు చేసి.. ముందుగానే మేనిఫెస్టోని వదిలిన కేసీఆర్ కాంగ్రెస్ వణుకుపుట్టిస్తున్నాడని చెప్పవచ్చు.