అరవింద ఖాతాలో మరో రికార్డు

తారక్ – త్రివిక్రమ్ ల అరవింద సమేత బాక్సాపీస్ దగ్గర అదరగొడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100కోట్ల క్లబ్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఓవర్సీస్ లోనూ 1.5మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇప్పుడు అక్కడ 2 మిలియన్‌ డాలర్ల మార్కును చేరినట్లు ట్రేడ్ వర్గాల సమాచారమ్. అంతేకాదు.. మొత్తం కలెక్షన్స్ రూ. 150కోట్లు దాటేశాయి. దీంతో ఆనందంలో ఉన్న చిత్రబృందం సక్సెస్ మీట్ ని నిర్వహించబోతుంది. ఆదివారం (అక్టోబర్ 21) హైదరాబాద్ శిల్పకళావేదికలో సక్సెస్ మీట్ జరగనుంది. ఈ సందర్భంగా అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ కి చిత్రబృందం థ్యాంక్స్ చెప్పనుంది.

త్రివిక్రమ్ – తారక్ కలయికలో వచ్చిన తొలి చిత్రమిది. రాయలసీమ ఫ్యాక్షన్ లో కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తారక్, త్రివిక్రమ్ అభిమానులని సంతృప్తిపరిచేలా సినిమాని మలిచారు. అది ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. ఫలితంగా నాన్ బాహుబలి రికార్డులన్ని బ్రేక్ చేసే దిశగా వీరరాఘవుడు దూసుకెళ్తున్నాడు. ఈ చిత్రంలో తారక్, జగపతి బాబుల నటన, త్రివిక్రమ్ గ్రిప్పింగ్ స్కీన్ ప్లే, పూజా హెగ్డే గ్లామర్ హైలైట్ గా నిలిచాయని ప్రేక్షకులు చెప్పుకొంటున్నారు.