ఎన్టీఆర్ అభిమానులూ.. మరో పండగొచ్చేసింది !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి మరో పండగ వచ్చేసింది. దసరా పండగా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’డు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాన్ బాహుబలి రికార్డులన్నీ కొల్లగొడుతూ పోతుంది. ఈ క్రమంలో రూ. 100కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసిది. ఓవర్సీస్ లోనూ 2మిలియన్ మార్క్ అందుకొంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇప్పటికే సక్సెస్ ప్రెస్ మీట్స్ నిర్వహించింది.

ఇప్పుడు అభిమానుల కోసం స్పెషల్ గా థ్యాంక్స్ మీట్ ని నిర్వహించబోతుంది. రేపు హైదరాబాద్ శిల్పాకళా వేదికలో అరవింద సక్సెస్ మీట్ జరగనుంది. ఇందులో చిత్రబృందం అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పనుంది. ఈ వేడుక టీవీ9, ఎన్టీవీలలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. రేపు సాయంత్రం 6గంటల నుంచి వేడుక పారంభం కానుంది. ఈ మేరకు దర్శకుడు త్రివిక్రమ్ ట్విట్టర్ చేశారు.

ఇక, ‘అరవింద సమేత వీరరాఘవ’లో రాయలసీమ ఫ్యాక్షన్ ని కొత్త కోణంలో చూపించారు త్రివిక్రమ్. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ గ్రిప్పింగ్ స్కీన్ ప్లే, మాటలు, పూజా గ్లామర్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. భారీ అంచనాల మధ్య దసరా పండగ సెలవుల్లో వచ్చిన అరవింద.. లాంగ్ రన్ లో నాన్ బాహుబలి రికార్డులన్నీ తుడిచిపెట్టేలా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం అభిమానుల కోసం స్పెషల్ థ్యాంక్స్ మీటుని ఏర్పాటు చేశారు.