అభిమానులని బాధపెట్టిన మహేష్ ట్విట్.. !!


సూపర్ స్టార్ మహేష్ బాబు పండగ పూట అభిమానులని బాధపెట్టినట్టు తెలుస్తోంది. ఈ మధ్య మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్, పిక్ లని అభిమానులతో పంచుకొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 7మిలియన్ దాటేసింది. ఇండస్ట్రీలోనూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. తోటి నటీనటుల సినిమాలపై తన అభిప్రాయాన్ని పంచుకొంటున్నారు. అడిగితే చిన్న సినిమాలని ప్రమోటు కూడా చేస్తున్నారు.

ఇది మహేష్ బాబు అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థానంలోకి మహేష్ వచ్చేశాడు. చిరు మాదిరిగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని గొప్పగా చెప్పుకొంటున్నారు. ఐతే, దసరా శుభాంకాంక్షలు చెబుతూ మహేష్ చేసిన ట్విట్ మాత్రం అభిమానులని బాధపెట్టింది. దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ ట్విట్ చేశాడు. తెలుగు, తమిళం, మలయాలం, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లోనే శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కన్నడ అభిమానులు ఫీలైపోతున్నారు.

అన్ని భాషలకు సమానమైన ప్రాముఖ్యత ఇవ్వండి. ఎక్కువగా అభిమానులున్న కన్నడకు కూడా కాస్త గౌరవం ఇవ్వడంటూ
మహేష్‌కు సూచించారు. దీంతో పొరపాటును గుర్తించిన మహేశ్‌ బాబు కన్నడ భాషను కూడా చేరుస్తూ మరోసారి అభిమానలకు ధన్యవాదాలు తెలిపారు. ఐతే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక మీదటనైనా మహేష్ ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడితే మంచిదేమో. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.