దర్శకుడి టార్చర్’తో విదేశాలకు పారిపోయిన బాలీవుడ్ నటి
దేశంలో #మీటూ ఉద్యమం ఉప్పెనలా ఉప్పొంగుతోంది. ప్రముఖులు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా, బాలీవుడ్ దర్శకుడు విపుల్ షాపై నటి ఎల్నాజ్ నరౌజీ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె నెట్‌ఫ్లిక్ థ్రిల్లర్ ‘సేక్రెడ్ గేమ్స్’లో ‘జోయ’ పాత్రలో నటించి గుర్తింపు పొందారు. దీనికంటే ముందే సినిమాలో ఆఫర్ కోసం నరౌజీ దర్శకుడు విపుల్ షాని చాలా సార్లు కలిసిందట.
” ‘నమస్తే ఇంగ్లాండ్’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆడిషన్స్‌కి వెళ్లా. తొలిసారి ఆడిషన్స్‌లో నన్ను ముద్దు పెట్టుకున్నాడు. మరో రౌండ్‌లో కూడా అలా చేయడానికి ప్రయత్నిస్తే ఆయన్ను పక్కకు తోసి, దేశం వదిలి వెళ్లిపోయాను. భారత్‌కు తిరిగొచ్చాక విపుల్ పంజాబ్‌లోని పటియాలాకు రమ్మన్నారు. కథ వినిపించమంటే.. ‘నా గదికి రా, నీకు స్క్రిప్ట్ నరేట్ చేస్తా’నన్నారు. మానసికంగా 3నెలలు టార్చర్ అనుభవించేలా చేశాడు. ఆయన ఆఫీసుకు వెళ్లిన ప్రతిసారి నాతో తప్పుగా ప్రవర్తించేవాడు” అని ఆరోపించింది.