ఎన్టీఆర్ కోసం తమన్నా వచ్చేసింది

ఎన్టీఆర్ కోసం మిల్కీబ్యూటీ తమన్నా వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జయప్రద పాత్ర కోసం తమన్నాని తీసుకొన్నారు. తాజాగా, ఆమె షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఎన్టీఆర్-జయప్రద కాంబినేషన్ లో వచ్చిన అడవిరాముడు, సూపర్ మేన్, యమగోల సినిమాలు ఘన విజయం సాధించాయి. వీటికి సంబంధించి కొన్ని సన్నివేషాలని బయోపిక్ లో చూపించబోటున్నారు. ఐతే, జయప్రదగా తమన్నా ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది.

ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు పార్టులుగా ‘ఎన్టీఆర్-కథానాయకుడు’, ‘ఎన్టీఆర్-మహానాయకుడు’గా తీసుకురానున్నారు. ఈ రెండు కూడా వచ్చే యేడాది జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, ఏఎన్నార్ గా సుమంత్, చంద్రబాబుగా రానా దగ్గుపాటి, హరికృష్ణగా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు.