మోడీ-కేసీఆర్’లని ఒక్కటి చేసిన రాహుల్ !
ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లని ఒక్కటి చేసి మాట్లాడారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. వీరిద్దరులు అసత్యాలతో ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. శనివారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా భైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వీరిని సూటిగా పలు ప్రశ్నలు సంధించారు.
* గత ఎన్నికల్లో చెప్పినట్టు కేసీఆర్ తెలంగాణలో ప్రతి ఇంటికీ నీళ్లు ఇస్తున్నారా ?
* ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారా ?
* మోదీ ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేశారా ?
* 2 కోట్లమందికి ఉద్యోగాలు అన్నారు.. వచ్చాయా ?
* పునరాకృతి పేరిట ప్రాజెక్టుల వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం భారీగా పెంచేశారు.
* రఫేల్ ఓ పెద్ద కుంభకోణం. దేశానికి కాపలాదారుగా చెప్పుకునే మోదీ రఫేల్ ద్వారా దొంగగా మారాడు
* అసత్యాలతో మోదీ, కేసీఆర్ ప్రజలను వంచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించాలని రాహుల్ పిలుపునిచ్చారు.
మొత్తానికి.. మోడీ, కేసీఆర్ లని ఒక్కటి చేసి మాట్లాడటం ఆకట్టుకొంది. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలా రాహుల్ ప్రసంగం సాగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పాటు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం రాహుల్ ప్రచారం చేసినట్టు అనిపిస్తోంది. మరీ.. రాహుల్ మాటలని తెలంగాణ ప్రజలు ఏ మేరకు నమ్ముతారనేది ఎన్నికల ఫలితాలతో తేలిపోనుంది.