కీర్తి సురేష్’కి ఆ హీరో కావాలట !

స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయిన కొత్త కథానాయిక కీర్తి సురేష్. ‘మహానటి’ సావిత్రి బయోపిక్ తో ఆమె కీర్తి మరింతగా పెరిగింది. ఆమె నటించిన విశాల్ ‘పందెంకోడి 2’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తెచ్చుకొంది. ఐతే, ఈ సినిమా సమయంలో విశాల్-కీర్తి చాలా దగ్గరయ్యారు. ఇదే ప్రేమే అనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం పక్కనపెడితే కీర్తి మాత్రం విజయ్‌ సేతుపతి కోసం వెయిట్ చేస్తుందట. ఆయన వైవిధ్యమైన నటుడు. ఆయనతో కలసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని తన మనసులోని మాటని బయటపెట్టింది కీర్తి. అంతేకాదు.. అజిత్ తో నటించాలని ఉంది. ఆ అవకాశం త్వరలోనే వస్తుందని భావిస్తున్నానని చెప్పుకొంది.

పందెంకోడి 2 ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి.. దర్శకురాలు కావాలన్నదే నా లక్ష్యం. తప్పకుండా భవిష్యత్తులో దర్శకురాలిని అవుతాననే నమ్మకం ఉందని తెలిపింది. నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాలతో టాలీవుడ్ లోనూ కీర్తి సురేష్ కీర్తి పెరిగిపోయింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ ద్విబాషా చిత్రాలకి మంచి ఆప్షన్ గా మారింది.