తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాని విడుదల చేసింది. మిగిలిన 14స్థానాలకు గానూ కసరత్తు చేస్తోంది. ఐతే, టీఆర్ఎస్ కు తామే ప్రధాన ప్రత్యర్థులం అని చెప్పుకొనే కాంగ్రెస్, భాజాపాలు అభ్యర్థులని ఖరారు చేయడంలో జాప్యం చేస్తోంది. దీంతో.. ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో వెనకబాటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజాపా 38మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాని శనివారం విడుదల చేసింది. శనివారం అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరిన డాక్టర్‌ జె.వెంకట్‌ కోరుట్ల నుంచి బరిలోకి దిగనున్నారు.

1 లక్ష్మణ్‌ – ముషీరాబాద్‌

2 జి. కిషన్‌ రెడ్డి – అంబర్‌పేట్‌

3 చింతల రామచంద్రా రెడ్డి – ఖైరతాబాద్‌

4 ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ – ఉప్పల్‌

5 టి. రాజా సింగ్‌ – గోషా మహల్‌

6 ఎన్‌. రామచందర్‌రావు – మల్కాజ్‌గిరి

7 పేరాల శేఖర్‌ రావు – ఎల్బీనగర్‌

8 జి రామకృష్ణారెడ్డి – పెద్దపల్లి

9 సక్కినేని వెంకటేశ్వర్రావు – సూర్యాపేట్‌

10 పి. మోహన్‌రెడ్డి – మేడ్చల్‌

11 టి. ఆచారి – కల్వకుర్తి

12 జి. మనోహర్‌ రెడ్డి – మునుగోడు

13 కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి – పాలేరు

14 బండి సంజయ్‌ – కరీంనగర్‌

15 ఎమ్‌ రఘునందన్‌ రావు – దుబ్బాక

16 బాబు మోహన్‌ – ఆందోల్‌

17 కుంజ సత్యవతి – భద్రాచలం

18 పాయల్‌ శంకర్‌ – ఆదిలాబాద్‌

19 పదకంటి రమాదేవి – ముథోల్‌

20 కె రతంగ పాండు రెడ్డి – నారాయణ్‌పేట్‌

21 బి. కొండయ్య – మక్తల్‌

22 ఎన్‌. శ్రీ వర్ధన్‌రెడ్డి – షాద్‌ నగర్‌

23 పి. విజయ చంద్రారెడ్డి – పరకాల

24 చందుపట్ల కీర్తి రెడ్డి – భూపాలపల్లి

25 మాధవి రాజు – భోథ్‌

26 కొయ్యల ఏమాజి – బెల్లంపల్లి

27 వెంకట రమణా రెడ్డి – కామారెడ్డి

28 కేశ్‌పల్లి ఆనంద్‌ రెడ్డి – నిజామాబాద్‌ రూరల్‌

29 సంతోష్‌ కుమార్‌చందా – పినపాక

30 ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి – ఆర్మూర్‌

31 కన్నం అంజయ్య – ధర్మపురి

32 గడ్డం నాగరాజు – మానకొండూరు

33 పటేల్‌ రవిశంకర్‌ – తాండూర్‌

34 టి. అమర్‌సింగ్‌ – కార్వాన్‌

35 గద్వాల్‌ వెంకటాద్రి రెడ్డి – గద్వాల​

36 మల్లేశ్వర్‌ మేడిపూర్‌ – అచ్చంపేట్‌

37 నంబూరి రామలింగేశ్వర రావు – సత్తుపల్లి

38 జె. వెంకట్‌ – కోరుట్ల