రణ్-దీప్ పెళ్లిడేటు చెప్పేశారు
బాలీవుడ్ ప్రేమజంట రణ్ వీర్ సింగ్ – దీపికా పదుకొణెల పెళ్లిపై జరిగిన ప్రచారం నిజమైంది. వీరి వివాహం వచ్చే నెలలోనే జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రచారం నిజమైంది. రణ్-దీప్ లు పెళ్లి డేటు చెప్పేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సంయుక్తంగా ఓ లేఖను పోస్ట్ చేశారు.
“మా కుటుంబాల ఆశీస్సులతో నవంబరు 14, 15 తేదీల్లో మా వివాహ వేడుక జరగబోతోందన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నేళ్లుగా మాపై ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ప్రేమ, విశ్వాసాలతో కూడిన అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న ఈ సందర్భంలో మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇక, విరుష్క’ల పెళ్లి తరహా చాలా సీక్రెట్ గా వీరి పెళ్లిని ప్లాన్ చేశారట. ఇటలీలోని సముద్ర తీరాన రణ్-దీప్’ల వివాహం జరగనుందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా.. రణ్ వీర్ ‘టెంపర్’ రిమేక్ ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు, దీపికా మొఘనా గుల్జార్ దర్శకత్వంలో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
— Deepika Padukone (@deepikapadukone) October 21, 2018
Hope you are all well. #DeepikaPadukone weds #RanveerSingh
pic.twitter.com/DCuWlZNxy3
— Ranveer Singh (@RanveerSinghs_) October 21, 2018