షాక్ : హైదరాబాద్’కు ధావన్ గుడ్ బై
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ హైదరాబాద్ కు షాక్ ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. ఆయన ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐతే, తన స్థాయికి తగిన ఫీజ్ రావడం లేదని గబ్బర్ అసంతృప్తితో ఉన్నాడట. భారత జట్టులోని విరాట్ కోహ్లీ రూ. 17 కోట్లు, రోహిత్ శర్మ రూ.15 కోట్లు, ఎంఎస్ ధోనీ రూ.15 కోట్లు భారీ మొత్తాలు ఆర్జిస్తున్నారు. ధావన్‌కు మాత్రం రూ.5.2 కోట్లు మాత్రమే వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ ని విడిచి ముంబయి ఇండియన్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు సమాచారమ్. ఇదే జరిగితే.. ముంబయి జట్టులో ధావన్-రోహిత్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఆటగాళ్లను ఇతర ప్రాంఛైజీకు బదిలీ చేసుకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ముంబయి ఇండియన్స్ బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్‌ను వదిలేసి క్వింటన్ డికాక్‌ను తీసుకుంది. ఇప్పుడు ధావన్ తమ జట్టులో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది.