కమెడియన్ పెళ్లి.. ఎవ్వరికీ చెప్పకండీ.. !
టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వచ్చే యేడాది జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ కాస్త కామెడీగానే ట్విట్ చేశాడు. బీచ్లో తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన రాహుల్ ‘జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి’ అంటూ కామెంట్ చేశాడు.
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో విజయ్ దేవరకొండకి చెడ్డి కా దోస్త్ లా నటించారు. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత మహేష్ ‘భరత్ అను నేను’, గీత గోవిందం చిత్రాల్లో ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాడు. ఇక, బీచ్ లో కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోను బట్టి చూస్తే.. ఈ కమెడియన్ ది ప్రేమ వివాహంలా కనబడుతోంది. ఐతే, ఆ విషయాలేవీ చెప్పకుండా పెళ్లి డేటు చెప్పేశాడు. ఇక, పెళ్లి చేసుకోబోతున్న ఈ కమెడియన్ కు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.