ప్రియాంక-నిక్ సీక్రెట్ మ్యారేజ్ ?
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలోనే వీరి పెళ్లి చేసుకోబోతున్నారు. ఐతే, అంతకంటే ముందే వీరిద్దరు సీక్రెట్ గా లాస్ వేగాస్ లో పెళ్లి చేసుకొన్నారని సమాచారమ్. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ జంట ముందు ఎంగేజ్ మెంట్ ని సీక్రెట్ గా చేసుకొంది. ఆ విషయాన్ని ప్రియాంక చేతివేలికి ఉన్న ఉంగరంతో బయటపడింది. ఆ తర్వాత ఆ విషయాన్ని ప్రియాంక అంగీకరించింది కూడా. అయినా ముంబైలోని ప్రియాంక నివాసంలో ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ లు మరోసారి నిశ్చితార్థ వేడుక జరుపుకొన్నారు. పూర్తిగా హిందూ సాంప్రదాయపద్దతిలో జరిగిందీ.. వేడుక. ఇప్పుడు పెళ్లి కూడా ఈ తరహా మొదట సీక్రెట్ గా, ఆ తర్వాత పబ్లిక్ గా చేసుకోబోతుందట ఈ జంట.
ఇప్పటికే సీక్రెట్ పెళ్లి అయిపోయింది. వచ్చే నెలలో పబ్లిక్ గా మళ్లీ చేసుకోబోతున్నారు. నిశ్చితార్థం, పెళ్లి.. ఇలా డబుల్ డబుల్ ఎందుకు అంటే.. సీక్రెట్ అన్నీ అమెరికా సంప్రదాయంలో.. పబ్లిక్ గా అన్నీ హిందూ సాంప్రదాయంలో అని చెబుతున్నారంట. అన్నట్టు.. ఇప్పటికే ప్రియాంక పనులు ప్రారంభమయ్యాట.
Did #PriyankaChopra and #NickJonas get secretly married in Las Vegas? See pichttps://t.co/MK6xZF1WPf pic.twitter.com/fhgopNKnkL
— India Today Showbiz (@Showbiz_IT) October 23, 2018