ఒక్క సిక్స్’తో సచిన్ ని దాటేస్తా
భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఇంకొక్క సిక్స్ తో సచిన్ రికార్డుని సమం చేయబోతున్నాడు. ఇప్పటివరకూ 189 వన్డేలు ఆడిన రోహిత్ 7217 పరుగులు చేశాడు. ఇందులో 627 ఫోర్లు, 194 సిక్స్‌లు ఉన్నాయి. ఇక సచిన్ (195 సిక్స్‌లు) రికార్డును సమం చేయడానికి ఇంకో సిక్స్ కొడితో చాలు.
విండీస్‌తో రెండో వన్డే బుధవారం వైజాగ్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ సచిన్ రికార్డును సులువుగా బద్దలు కొడతాడని చెప్పుకొంటున్నారు. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ 152 పరుగులతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ ఏకంగా 8 సిక్స్ లు బాదాడు. ఇక, రెండో వన్ డే రోహిత్ మరో రెండు సిక్స్ బాదేస్తే.. సిక్సుల్లో సచిన్ మించిపోనున్నాడు.
ఇక, అత్యధిక సిక్సులు బాధిన ఆటగాళ్లలో తొలిస్థానంలో పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది(351 సిక్స్‌లు), రెండో స్థానంలో క్రిస్ గేల్ (275 సిక్స్‌లు) ఉన్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య(270 సిక్స్‌లు) మూడో స్థానంలో, ధోనీ(217 సిక్స్‌లు) నాలుగో స్థానంలో ఉన్నారు.