‘సాహో’ మేకింగ్ వీడియో వచ్చేసింది !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇవాళ తన 39వ పుట్టినరోజుని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి. టాలీవుడ్ మొత్తం డార్లింగ్ ని విష్ చేస్తోంది. వివిధ సందర్భాల్లో ఆయన కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డార్లింగ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక, ప్రభాస్ నుంచి అభిమానులకి బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ ‘సాహో’ మేకింగ్ వీడియో ఛాప్టర్ – 1 ని విడుదల చేసింది చిత్రబృందం. అది అదరిపోయింది. హాలీవుడ్ లో రేంజ్ సాహో ఉండబోతుందని అర్థమవుతోంది. యాక్షన్స్ సీన్స్.. చివర్లో ప్రభాస్ స్టయిలీష్ ఎంట్రీ ని మేకింగ్ వీడియో చూడొచ్చు. ఆ వీడియోని మీరు ఓ సారి చూసేయండీ.. !