దీపావళి పండగ.. సుప్రీం ఆంక్షలు ఇవీ !
దసరా సంబరాలు ముగిశాయ్. మరికొద్ది రోజుల్లో దీపావళి పండగ రానుంది. దీపావళి పండగ అంటేనే టపాసుల మోత. ఐతే, దీనిపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పెద్దమొత్తంలో బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని, దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిగిన సుప్రీం కోర్టు పటాసుల అమ్మాకాలు, వాటి కాల్చే విషయలో పలు ఆంక్షలు విధించింది.
* పటాసుల అమ్మకాలపై నిషేధం విధించలేం
* ఐతే, దీపావళి పండగ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలి
* ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా బాణసంచా విక్రయాలపై నిషేధం
* ఈ తీర్పు కేవలం దీపావళి పండగకు మాత్రమే కాదు. అన్ని మతాల పండగలు, శుభకార్యాలకు వర్తిస్తుందని సుప్పీంకోర్టు తెలిపింది.
* దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి
* క్రిస్మస్, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.55 నుంచి 12.30 గంటల మధ్య బాణసంచా కాల్చాలి ఆంక్షలు విధించింది సుప్రీం కోర్టు.