త్రివిక్రమ్’తోనే బన్నీ సినిమా.. ముహూర్తం ఫిక్స్ !
స్టయిలీష్ స్టార్ అల్లుఅర్జున్ తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ తో బన్నీ సినిమా దాదాపు ఫిక్సయింది. డిసెంబర్ లో సినిమాని ప్రారంభించబోతున్నారు. బన్నీ కోసం ఓ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాన్ని రిమేక్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడట. ఇదీగాక, ఆయన కోసం మరో కథని కూడా రెడీ చేస్తున్నారు. ఈ రెండు మూడు రోజుల్లో ఆ కథని బన్నీకి వినిపించబోతున్నాడు.
ఈ రెండు కథల్లో ఒకదానితో బన్నీ సినిమా ఉండబోతుందని తెలిసింది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది.
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత అల్లు అర్జున్ మరో చిత్రం చేయలేదు. కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. మొదట విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా అనుకొన్నారు. కథ కూడా రెడీ అయ్యింది. ఐతే, అది బన్నీని పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేదు. దీంతో బన్నీ కోసం మరో కథని రెడీ పనిలో విక్రమ్ ఉన్నాడట. ఈలోపు త్రివిక్రమ్ తో బన్నీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ సినిమా తర్వాతైనా విక్రమ్ సినిమాతో బన్నీ సినిమా ఉంటుందేమో చూడాలి.