ఫ్లాప్ టాక్ సినిమాపై భారీ ఆశలు !

ఇంద్రసేన దర్శకత్వంలో నారా రోహిత్, సుధీర్ బాబు, శశాంక్, శ్రీవిష్ణు, శ్రియ శరణ్, శ్రీ సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు. ఈ చిత్రానికి సంగీతం సతీష్ రఘునాథన్. రేపు (అక్టోబర్ 26)న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే రెండ్రోజుల ముందే అక్టోబర్ 24న ఓవర్సీస్ లో ఈ సినిమాని విడుదల చేశారు. అక్కడ సినిమా ప్లాప్ టాక్ రావడంతో పెద్ద దెబ్బపడింది.

వాస్తవానికి విభిన్నమైన కథని ఓవర్సీస్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగుంటాయని చిత్రబృందం భావించింది. ఐతే, వారి ప్లాన్ బెడిసికొట్టింది. టీజర్, ట్రైలర్లతో మంచి హైప్ తెచ్చుకున్న సినిమాని చేతులారా పాడు చేసుకొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిటైన సినిమాలు సైతం ఓవర్సీస్ లో పెద్దగా ప్రభావం చూపవని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాప్ టాక్ సినిమా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.

అదే జరిగితే జరిగిన డ్యామేజ్ నుంచి వీరభోగ వసంతరాయలు చిత్రబృందం కొద్దిలో కొద్దిగా బయటపడే ఛాన్స్ ఉంది. అదీగాక, ఇక్కడ ప్లాప్ టాక్ వస్తే వారిని దేవుడు కూడా కాపాడలేడు. మరీ… ఈ ప్లాప్ టాక్ సినిమా రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది ఓ లుక్కేయండీ.. !