విజయ్ దేవరకొండ.. మహేష్, చరణ్’లని మించిపోయాడు !

యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, రామ్ చరణ్ లని మించిపోయాడు. ఈ యేడాది రంగస్థలం, భరత్ అను నేను, మహానటి, గీత గోవిందం, అరవింద సమేత సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ గా నిలిచాయి. ఇందులో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘గీత గోవిందం’ తొలి స్థానంలో నిలిచింది. ఈ సినిమా రూ. 55కోట్లకి పైగా లాభాలు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత స్థానంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ రూ. 43కోట్ల లాభాలాని తెచ్చిపెట్టింది. ఈ జాబితాలో మూడవ స్థానంలో ‘మహానటి’ నిలిచింది. ఈ సినిమా 25 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక, నాల్గొవ స్థానంలో ‘భరత్ అనే నేను నిలిచింది. ఈ సినిమా రూ.15 కోట్ల లాభాలను రాబట్టింది. ఇంకా అరవింద సమేత లాభాల లెక్క తేలలేదు. అప్పటి వరకు ఈ యేడాది అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన హీరోగా విజయ్ దేవరకొండ కొనసాగనున్నాడు.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోల్లో జాబితాలో విజయ్ దేవరకొండ చేరిపోయాడు. ఇప్పుడదే సినిమాతో స్టార్ హీరోలు మహేష్, రామ్ చరణ్.. లని మించిపోయాడు. అన్నట్టు ఈ సినిమా హిట్ క్రెడెట్ గోవిందుడు తో పాటు గీత రష్మిక మందనకి కూడా దక్కుతుంది.