#మీటూ : బట్టలు విప్పించి చాతిపై క్రీమ్ రాశాడు

#మీటూ ఉద్యమంలో భాగంగా దారుణాలు బయటికొస్తున్నాయి. తమకు ఎదురైన లైంగిక వేధింపులని మహిళలు ధైర్ఘ్యంగా బయటపెడుతున్నారు. ప్రముఖ టీవీ నటి సొనాల్‌ వెంగురేల్కర్‌ 19యేళ్ల వయసులో ఎదుర్కొన్న దారుణాన్ని బయటపెట్టింది.
ఆ వయసులో ఫొటోగ్రాఫర్‌, క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ రాజ బజాజ్‌ తన పట్ల అసభ్యంగా వ్యవహరించాడని ఆరోపించారు.

ఓ ఆన్ లైన్ పోర్టల్ లో ఆడిషన్స్ కోసం అవకాశం కోసం వెంగురేల్కర్ రాజ బజాజ్ ని సంప్రదించిందట. అప్పుడు తాంత్రిక విద్యలు నేర్పుతా. దాని వలన రాత్రికి రాత్రే విజేతలు అవుతారని మభ్యపెట్టాడట. ఒంటిమీద దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించడంతో పాటు, బలవంతంగా ఛాతీపై క్రీమ్‌ను రాశాడని ఆరోపించింది వెంగురేల్కర్.

దీనిపై రాజ బజాజ్ స్పందన కూడా షాక్ కి గురి చేస్తోంది. సొనాల్‌ వెంగురేల్కర్‌ కేవలం డబ్బుకోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. ఆమె మార్చి 7న తన ఇంటికి వచ్చి డబ్బు డిమాండ్‌ చేసింది. రూ 3 లక్షలు డిమాండ్‌ చేసింది. ఆ తర్వాత రూ 1.5 లక్షలకు దిగివచ్చింది. అందుకు తాను తిరస్కరించడంతో.. ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చారు.