జగన్’పై దాడి విషయాన్ని ముందే చెప్పిన హీరో !
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి తెలుగు రాష్ట్ర రాజకీయాలని వేడెక్కిస్తోంది. ఇది పక్కా కుట్ర. అది కూడా కేంద్రం చేసిన కుట్ర అనే కామెంట్స్ వినబడుతున్నాయి. కేంద్ర ఆధీనంలో వినాశ్రాయంలోనే దాడి జరిగిందని మంత్రి గంటా శ్రీనివాస్ లాంటోళ్లు అంటున్నారు. ఐతే, ఈ దాడిని ముందే ఊహించి చెప్పాడు హీరో శివాజీ. ఆయన నైతికంగా బీజేపీ నేతగా కొనసాగినా.. తెలుగు వాడి గొంతుని వినిపించేందుకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీనే టార్గెట్ చేస్తున్నారు కూడా.
చాన్నాళ్ల క్రిందట శివాజీ ఏపీపై కేంద్రం నిర్వహించబోయే ఆపరేషన్ గరుడ ని బయటపెట్టారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష నాయకుడు జగన్ పై దాడి జరుగుతుంది. తద్వారా ఏపీలో అలజడి సృష్టించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశారు. బీహార్, ఓరిస్సా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్లీపర్ గుండాలు ఏపీలో శాంతిభద్రతలకి విఘాతం కలుగజేయనున్నారని తెలిపారు. ఇప్పుడు జగన్ పై దాడితో అది నిజం అని తేలింది. ఈ నేపత్యంలో శివాజీ లీక్ చేసిన మొత్తం ఆపరేషన్ బట్టి చూస్తే.. ఏపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం.. టీడీపీని తీవ్ర దెబ్బకొట్టడం.. ఏపీలో జనసేన, వైసీపీ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే మిగిలివున్నాయి.