త్రివిక్రమ్ సినిమాకి కళ్యాణ్ నిర్మాత

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు సమాచారమ్. ‘అరవింద సమేత’ తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నాడు. ప్రస్తుతం కథ కసరత్తు చేస్తున్నాడు. ఓ బాలీవుడ్ సినిమా రిమేక్ లేదంటే సొంత కథతో బన్నీ సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని డిసెంబర్ లోనే ప్రారంభించబోతున్నట్టు తెలిసిందే. బన్నీ సినిమా తర్వాత వెంకీతో త్రివిక్రమ్ సినిమా ఉండనుంది.

ఈ రెండు సినిమాల తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నట్టు సమాచారమ్. అలాగని ఇందులో ఎన్టీఆర్ లేదంటే కళ్యాణ్ రామ్ హీరోగా నటించడం లేదట. ఓ యంగ్ హీరోతో ఈ సినిమా ఉండబోతుందని చెబుతున్నారు. ఆ హీరో ఎవరు ? ఆ సినిమా కథేంటీ ? అనేది తెలియాలంటే మరో యేడాది పాటు వెయిట్ చేయాల్సిందే అప్పటి వరకు త్రివిక్రమ్ బిజీ మరీ.. !