సమంత ఓ.. అద్భుతం !


పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా హవా చూపిస్తోంది సమంత. ఈ యేడాది ఆమె ఖాతాలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్దాయి. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్.. ఇలా నాన్ స్టాప్ హిట్స్ ని ఖాతాలో వేసుకొంది. ప్రస్తుతం భర్త నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. దీనికి శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రం కోసం మజిలీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఈ సినిమా తర్వాత సామ్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించనుంది. ఇదో ప్రయోగాత్మక చిత్రమని తెలిసింది. ఇందులో యంగ్ హీరో నాగశౌర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. కొరియన్ డ్రామా సినిమా ‘మిస్ గ్రానీ’ ఇన్స్పిరేషన్ తో నందిని రెడ్డి ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకున్నారు. ఇందులో సమంత 60 యేళ్ల బామ్మగా కనిపిస్తుంది. కథను నేరేట్ చేసే సమయంలో సడెన్ గా యంగ్ గా మారిపోతుంది. అద్భుతమైన కథ-కథనాలతో సినిమా ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే యేడాది జనవరిలో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. భర్త నాగ చైతన్య సినిమాతో పని పూర్తి చేసుకొన్న తర్వాత సామ్ ఈ సినిమాపై ఫోకస్ చేయనుంది. యూటర్న్ తర్వాత సామ్ చేయబోతున్న లేడీ ఓరియెంట్ చిత్రమిది.