పిక్ టాక్ : ప్రభాస్’తో రెహమాన్‌ అదిరింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తో కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రీకరణ రోమ్‌లో జరుగుతోంది. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘డార్లింగ్‌’ను కలిసిన ఏఆర్‌ రెహమాన్‌ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెహమాన్‌తో కలిసి ప్రభాస్‌ దిగిన ఫొటో సామాజిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ ని చూసి ప్రభాస్ అభిమానులు పండగ చేసుకొంటున్నారు.

ఒక పక్క సుజిత్‌ దర్శకత్వంలో ‘సాహో’లో నటిస్తూనే మరోపక్క ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రాన్ని మొదలు పెట్టేశారు ప్రభాస్. ఈ చిత్రానికి ‘అమూర్‌’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, ‘సాహో’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘సాహో’ చాప్టర్‌-1 మేకింగ్‌ వీడియో చూస్తే.. సినిమాని హాలీవుడ్‌ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు అర్థమవుతోంది.