‘కబీర్ సింగ్’గా ‘అర్జున్ రెడ్డి’ !

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ్, హిందీ బాషల్లో రిమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ తెరకెక్కుతోంది. కైరా అద్వానీ హీరోయిన్. మాతృక దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం కబీర్ సింగ్ అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. టైటిల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇక్కడ రెడ్డి.. అక్కడ సింగ్ గా మారబోతున్నాడు. మరీ.. కబీర్ సింగ్ హవా ఏ రేంజ్ లో ఉండబోతుందన్నది చూడాలి.

ఇక, టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరం దేవదాస్ అనిపించుకొంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత గీత గోవిందం బ్లాక్ బస్టర్ తో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఇక, తమిళ్ లో ‘అర్జున్ రెడ్డి’కి ‘వర్మ’ పేరుతో రానుంది. ఇప్పటికే వర్మ టీజర్ కూడా బయటికొచ్చింది.