మెగాస్టార్’తో కొరటాల సినిమా.. ఇప్పట్లో లేనట్టే !

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత కూడా స్పీడు పెంచారు. ప్రస్తుతం ఆయన 151 సినిమాగా ‘సైరా నరసింహారెడ్ది’ తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో ‘బాహుబలి’ రేంజ్ సినిమాగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన టీజర్ ఉంది.

ఇక, ఈ సినిమా తర్వాత చిరు 152 కొరటాల శివ దర్శకత్వంలో ఉంది. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ఆ పనులు ఆఖరి దశకు చేరుకొన్నాయి. డిసెంబర్ లోనే సినిమా ప్రారంభోత్సవం జరుపుకొంది. వచ్చే యేడాది జనవరిలో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారనే ప్రచారం జరిగింది. ఐతే, తాజా సమాచారమ్ ప్రకారం ఈ సినిమా మొదలవ్వడానికి ఇంకా ఆసస్యం కానుందట. వచ్చే యేడాది సంక్రాంతి తర్వాతే సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుందని తెలిసింది.

దీనికి రెండు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటి వరకు కొరటాల ఫైనల్ స్క్రిప్టుని మెగాస్టార్ కి వినిపించలేదట. మెగాస్టార్ స్క్రిప్టుని ఓకే చేసిన వెంటనే ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. ఇదీగాక, సైరా షూటింగ్ పూర్తయ్యేంత వరకు కొరటాల సినిమాపై ఫోకస్ పెట్టేందుకు చిరు ఇష్టపడటం లేదట. ఈ నేపథ్యంలో ఈ సినిమా వచ్చే యేడాది జనవరి ఆఖరి వారంలో ప్రారంభోత్సవం జరుపుకొని.. ఫిబ్రవరి లేదంటే మార్చిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు.