‘మజిలీ’ వీడియో లీక్.. సమంత షాక్ !

భర్త నాగ చైతన్యతో సమంత పర్సనల్ వీడియో లీకైంది. ఓ ఇంట్లో ఇద్దరు కూర్చొని పర్సనల్ మాట్లాడుకొంటున్న వీడియో అది. వాళ్లిద్దరు మాటలకే పరితమయ్యారు. ఇంకా చేతల వరకు వెళ్లలేదు. ఇంతకీ ఆ వీడియోలో సామ్-చై ఏం మాట్లాడుకొంటున్నారా తెలుసా ? ‘మజిలీ’ సినిమా గురించి. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రమిది. ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైంది.

ఈ సినిమా గురించి సామ్-చై పర్సనల్ గా మాట్లాడుకొంటున్న వీడియోని ఓ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ఈ వీడియో చూశాక.. అద్భుతమైన భావన కల్గింది. మీరు చైతన్యతో ఏదైనా టాప్‌ సీక్రెట్‌ మాట్లాడుతున్నారా సమంత ? ‘మజిలీ’ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’’ అని అభిమాని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ని చూసిన సామ్ షాక్ అయిన ఎమోజీలను కామెంట్‌గా పెట్టింది. ఆ తర్వాత ఆ ట్విట్ ని డిలీజ్ చేశారనుకోండి.. ! ఆ పర్సనల్ వీడియో లో చై-సామ్ మాటలకే పరితమయ్యారు కాబట్టి సరిపోయింది. వీళ్లు కాస్త చేతలకి వెళీతే పరిస్థితి ఏంటీ ?? అన్నది షాక్ కి గురిచేస్తోంది.