మెగా ఫ్యామిలీ.. పెద్ద రాక్షసులు !

మెగా ఫ్యామిలీ మొత్తం రాక్షసులుగా మారారు. భయంకరమైన గెటప్‌లలో ఫోటోలకి పోజులిచ్చారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్‌ కుటుంబ సభ్యులు ‘హాలోవీన్’‌ వేడుకగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా విచిత్ర వేషధారణలో సందడి చేశారు.

చిరంజీవి, అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి, ఉపాసన, వరుణ్‌తేజ్‌, నిహారిక, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ తదితరులు భయంకరమైన గెటప్‌లలో కనిపించారు. తన అత్త సురేఖను భయపెడుతున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఎంతో మంచి అత్తమ్మ, భయంకరమైన కోడలు. ‘హాలోవీన్’‌ పార్టీ’ అని దీనికి క్యాప్షన్‌ రాశారు.

ఇక, సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి షూటింగ్ తో బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రమిది. రామ్ చరణ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.