రామ్ పెళ్లి కబురు చెప్పాడు
ఎనర్జిట్ హీరో రామ్ పెళ్లి కబురు చెప్పేశాడు. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారంట. ఎప్పుడూ సినిమాల గోలేనా ? ఎప్పుడు పెళ్లి చేసుకొంటావు ? అంటూ పదే పదే అడుగుతున్నారంట. ఆ సమయంలో నాకేం వినబడనట్టు నటించేస్తున్నా. ఎప్పటికప్పుడు తర్వాత సినిమా పూర్తవ్వగానే పెళ్లి చేసుకొంటానని చెప్పి తప్పించుకుంటున్నానని తెలిపారు రామ్. అదే సరే.. ఇంతకీ ఈ ఎనర్జిటిక్ హీరోకు పెళ్లి చేసుకొనే ఆలోచన ఉందా ? ఎవరితోనైనా ప్రేమలో ఉన్నాడా.. ?? అనేది మాత్రం చెప్పడం లేదు.
రామ్ తో పాటు టాలీవుడ్ లో పెళ్లి వేధింపులు ఎదుర్కొంటున్న హీరోల్లో ప్రభాస్ ముందు వరసలో ఉన్నారు. ఆయన్ని పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు చాన్నాళ్ల నుంచి వెంటబడుతున్నారు. ప్రభాస్ పెళ్లిపై ఆయన పెదనాన్న కృష్ణం రాజు కూడా చేతులెత్తేశాడు. ఎన్నిసార్లని అడగాలి. ప్రభాస్ కు పెళ్లి చేసుకోవాలని తెలీదా అంటూ ఓ సందర్బంలో అభిమానులతో అన్నారు సీనియర్ రెబల్ స్టార్. ఇక, రానా దగ్గుపాటి, నితిన్.. తదితరులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నవారే.
ఇక, రామ్ విషయానికొస్తే.. మిగితా యంగ్ హీరోలతో పోలిస్తే ఆయన కెరీర్ పరంగా కాస్త వెనకబడ్డారు. ఆ తర్వాత తెరకు పరిచయమైన నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్, వరుణ్ తేజ్.. తదితరులు విభిన్నమైన సినిమాలతో దూసుకెళ్తున్నారు. రామ్ లో మాత్రం ఎనర్జి తగ్గడం లేదు. కానీ.. ఆ ఎనర్జికి తగ్గట్టుగా విజయాలు మాత్రం దక్కడం లేదు. ఆయన నటించిన తాజా చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ బిజీగా ఉన్నారు.