రేవంత్’కు భద్రత పెంపు. కానీ.. !


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి తనకు ప్రాణహాని ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా కేసీఆర్‌పై పోరాడుతున్నందున తనకు ప్రాణహాని ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు 4+4 భద్రత కల్పించాలి. అది కూడా కేంద్ర భద్రత కావాలని ఈసీని, కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందన రాకపోవడంతో ఆయన హైకోర్టుని ఆశ్రయించారు.

దీనిపై తాజాగా, హైకోర్టు తీర్పునిచ్చింది. రేవంత్ రెడ్డి కోరిన విధంగా భద్రత కల్పించాలని, ఐతే, ఖర్చు ఆయనే భరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఇటీవల రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇవి రాజకీయ కుట్రలో భాగంగానే జరిగాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని గట్టిగా విమర్శించే నేతగా రేవంత్ పేరు తెచ్చుకొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం రేవంత్ ఎటాక్ పై సంతృప్తితో ఉందని చెబుతున్నారు.