‘సర్కార్’ కాపీ కథే.. అంగీకరించిన మురగ.. !!
విజయ్-మురగదాస్’ల హ్యాట్రిక్ చిత్రం ‘సర్కార్’. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సినిమా కథపై కాపీ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ‘సర్కార్’ కథ నాదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
దీనిపై స్పందించిన మురగదాస్.. అది అబద్ధం. వరుణ్ కథకు, నా కథకు ఉన్న పోలిక ఒక్కటే. ఇద్దరి కథలు ఓట్లను ఎలా దుర్వినియోగం చేశారు ? అన్న నేపథ్యంలో ఉంటాయి. నా కథలో ప్రస్తుత రాజకీయాలపై లోతుగా చర్చించాం. జయలలిత మరణం. ఆ తర్వాతి పరిణామాలు కూడా చూపించామని తెలిపారు. దీనిపై కోర్టులోనే తేల్చుకొంటాని తెలిపారు.
ఇప్పుడీ కాపీ వివాదంలో మురగ తగ్గినట్టు సమాచారమ్. ‘సర్కార్’ కథ కాపీనే అని ఆయన అంగీకరించారు. అంతేకాదు.. వరుణ్ రాజేంద్రన్ డిమాండ్ చేసినట్టుగానే ఆయనకు రూ. 30లక్షల పారితోషికంతో పాటు, టైటిల్స్ లో వరుణ్ కి క్రెడిట్ ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. దీంతో సర్కార్ వివాదానికి పులిస్టాప్ పడినట్టేనని చెబుతున్నారు. ఐతే, ఈ రాజీకి సంబధించిన ఇంకా అధికారిక ప్రకటన లాంటిది ఏమీ బయటకు రాలేదు.