జగన్ దాడి కేసు : వారి పేర్లు బయటపెట్టిన శ్రీనివాసరావు

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడి కేసులో నిజాలు బయటికొచ్చినట్టు సమాచారమ్. నిందితుడు శ్రీనివాసరావుని సిట్ అధికారులు గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. ఐతే, నిన్నటి వరకు శ్రీనివాసరావు నోరు విప్పింది లేదు. ఇవాళ మాత్రం ఆయన కీలక వ్యక్తుల పేర్లు బయటపెట్టినట్టు సమాచారమ్.

తల్లిదండ్రులను చూడాలని వుందని శ్రీనివాసరావు కోరడంతో.. వారిని పిలిపించారు. తల్లిదండ్రులను చూడగానే ఉద్వేగానికి గురైన శ్రీనివాసరావు బోరున ఏడ్చేశాడు. తండ్రిదండ్రుల ముందే శ్రీనివాస రావుని విచారించడంతో పోలీసులకి ఫలితం దక్కింది. వారి సమక్షంలోనే శ్రీనివాసరావు తన వెనకున్న కీలక వ్యక్తుల పేర్లని బయటపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసు కీలక మలుపు తీసుకోనుంది. ఇంతకీ.. శ్రీనివాసరావు వెనక ఉన్న ఆ ప్రముఖులు ఎవరన్నది సిట్ అధికారులు బయటపెట్టనున్నారు.