సీఎం హత్యకు కుట్ర ?
కర్ణాటక సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనని హత్య చేసేందుకు భాజాపా ప్లాన్ చేసిందని ఆరోపించారు. పదేళ్ల క్రితం బీజేపీతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో ఈ కుట్ర జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు మరోసారి బీజేపీ తనని టార్గెట్ చేసింది. దీపావళి లోపు ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రచారం చేసుకొంటున్నారని ఆరోపించారు కుమార స్వామి. మరీ.. 10యేళ్ల క్రితం జరిగిన కుట్రని ఇప్పుడు బయటపెట్టడం వెనక కుమార స్వామి ఆంతర్యం ఏమిటన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల జరిగిన కార్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయినా.. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడిదే స్పూర్తిగా కేంద్రంలోనూ కాంగ్రెస్ తో కలిసి ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ కూటమి దిశగా పావులు కదుపుతున్నారు. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఇందులో భాజాపాని దెబ్బకొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారమ్.