ధోని సంగతి తేల్చేసిన సౌరభ్


మాజీ కెప్టెన్, టీమిండియాలో కీలక ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని సంగతి సింపుల్ గా తేల్చేశారు మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ.
భారత టీ20 జట్టు నుంచి మహేంద్ర సింగ్‌ ధోనిని స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ధోని కెరీర్ ముగిసిందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే వరల్డ్ కప్ లో ధోని స్థానంపై డౌటు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా, టీ20లో ధోనికి స్థానం దక్కకపోవడంపై సౌరభ్‌ గంగూలీ స్పందించారు. ధోని ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. 2020 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. ధోని అప్పటిదాకా ఆడే అవకాశాలు లేవు. అలాంటపుడు సెలక్టర్లు.. మంచి ఫామ్‌లో ఉన్న రిషబ్‌ పంత్‌కు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు ? అని అభిప్రాయపడ్డారు గంగూలీ. ఇక, వరల్డ్ కప్ లోనూ ధోనికి స్థానం దక్కడంపై గంగూలీ అనుమానాలు వ్యక్తం చేశారు. దాని కోసం ధోని రంజీ ట్రోఫీలో ఆడి ఫాంలోకి రావాలని సూచించారు దాదా.