యాక్షన్’లోకి శ్రీరెడ్డి !
వివాదాస్పదన నటి శ్రీడ్డి నోటికి పని చెబితే ఎట్టుట్టదో తెలిసిందే. సభ్య సమాజం చెవులు మూసుకోవాల్సిందే. అంత ఓపెన్ గా మాట్లాడే రకం శ్రీరెడ్డి. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్, కోలీవుడ్ నూ షేక్ చేసింది. ప్రస్తుతం ఆమె మాటలకు పులిస్టాప్ పెట్టేసి.. చేతల్లో పడింది. మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లాంటి సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. తాజాగా, దీనికి సంబంధించిన ఓ వీడియోని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి ‘టేస్ట్ మై పంచ్’ అనే కాప్షన్ పెట్టింది.
అంతకంటే ముందుకు శ్రీరెడ్డి బుల్లెట్ నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె బుల్లెట్ నడపడం బాగానే ఉంది. ఐతే, ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకోకపోవడంపై నెటిజర్స్ మండిపడుతున్నారు. శ్రీరెడ్ది బుల్లెట్ నడపడం, మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లాంటి సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ తీసుకోవడం చూస్తుంటే.. ఆమె యాక్షన్ లోకి దిగబోతున్నట్టు కనబడుతోంది. అది లేడీ ఓరియెంటెడ్ చిత్రామా ? లేదంటే ఏదైనా చిత్రంలో కీలక పాత్రనా.. ?? అన్నది తెలియాల్సి ఉంది.
ఇటీవల శ్రీరెడ్డి గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. లారెన్స్ సినిమాలో తనకు అవకాశం లభించింది. ఆయన సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నా. ఈ మేరకు లారెన్స్ హామీ ఇచ్చారని తెలిపింది. బహుశా.. లారెన్స్ కోసమే శ్రీరెడ్డి కష్టపడుతుందేమో. అంతకంటే ముందు తనని లారెన్స్ లైంగికంగా వేధించాడని శ్రీరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనే పిలిచి మరీ.. ఆఫర్ ఇచ్చేసరికి శ్రీరెడ్డి ఎగిరిగత్తేస్తోంది.