కాంగ్రెస్’ని గెలిపించబోతున్న టీడీపీ !

తెలంగాణలో టీడీపీ బలాన్ని చూసి కాంగ్రెస్ షాక్ కి గురవుతోంది. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా తెలంగాణలో
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు కలిసి మహాకూటమిగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో సీట్ల పంపకం కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. టీడీపీ 18స్థానాలని అడుగుతుండగా.. కాంగ్రెస్ 14సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఐతే, టీడీపీకి కేటాయించే స్థానాలపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆ పార్టీకి షాక్ తగిలినట్టు తెలిసింది.

తెలంగాణలో ఏకంగా 35 స్థానాల్లో టీడీపీ సులభంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి 8నుంచి 10 స్థానాలని మాత్రమే కేటాయించాలని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు 18 స్థానాలని కేటాయించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారమ్. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకొంటున్నారు. తెలంగాణలో టీడీపీ బలాన్ని గుర్తించడంలో హస్తంపార్టీ ఆలస్యం చేసింది. కానీ, సీఎం కేసీఆర్ ముందే గురించారు. అందుకే ఆయన మొదటి నుంచి టీడీపీ, ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణకు పట్టిన శని చంద్రబాబు అని విమర్శించారు. కేసీఆర్ ఒక్కడే కాదు.. హరీష్ రావు, కేటీఆర్, కవిత.. ఇలా అందరు చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. అసలు టీఆర్ఎస్ ఇప్పటికీ చంద్రబాబుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది టీ-కాంగ్రెస్ చేసుకొన్న అంతర్గత సర్వేతో అర్థమైంది. తెలంగాణలో టీడీపీ ఇంకా మంచి పట్టుంది. దాన్ని ఓట్లుగా మలుచుకొనే తెలివి ఒక్కటే కావాలి. మరీ.. అందులో మహాకూటమి ఏమేరకు విజయం సాధిస్తున్నది చూడాలి.