తెలుగు రోబో.. టార్గెట్ వంద కోట్లు !


రోబో మరోసారి తెరపై సందడి చేయనుంది. దర్శకుడు శంకర్ రెడీ చేసిన రోబో సీక్వెల్ ‘2.ఓ’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. ప్రీ-రిలీజ్ బిజినెస్ ఆ రేంజ్ లోనే జరిగిపోయింది. తెలుగు రోబోని ఎన్వీఆర్ సినిమా కొనేసింది. ఇందుకోసం రూ. 80కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారమ్. ఈ లెక్కన తెలుగు రోబో టార్గెట్ రూ. 100కోట్లుగా పెట్టుకొన్నట్టు తెలుస్తోంది. హిట్ టాక్ వస్తే రెండు, మూడు రోజుల్లోనే ఆ కలెక్షన్స్ ఆ మార్క్ ని అందుకోనుంది.

ముందుగా ‘2.ఓ’ని ఏషియన్ సినిమా వారు తీసుకొన్నారు. ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడటంతో డిస్ట్రిబ్యూషన్ నుంచి తప్పుకొన్నారు. ఆ స్థానంలోకి ఎన్వీఆర్ సినిమా వచ్చేసింది. ఎన్వీప్రసాద్, దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను తీసుకున్నాయి. గతంలో రజనీ సినిమాలు బాబా, కొచ్చాడియన్, కాలా సినిమాలను ఎన్వీఆర్ సినిమా తీసుకుంది. బాబా సినిమాకు భారీ లాస్ రావడంతో.. రజినీకాంత్ పిలిచి మరి డబ్బు వెనక్కి ఇచ్చారు. ‘కాలా’ సినిమా లాభాలు తెచ్చిపెట్టకపోయినా.. నష్టాలు మాత్రం మిగల్చలేదు. మరీ.. ఇప్పుడు చిట్టి రోబోపై ఏకంగా రూ. 100కోట్ల టార్గెట్ పెట్టుకొన్నారు. టార్గెట్ రీచ్ అవుతారేమో చూడాలి.