‘సవ్యసాచి’ పబ్లిక్ టాక్
అఖినేని యంగ్ హీరో నాగ చైతన్య ‘సవ్యసాచి’గా ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. ‘ఎడమచేయి చెప్పిన మాట వినదు’ (లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్) అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటించారు. ఇదో ప్రయోగాత్మక చిత్రం కాదు.. పక్కా కమర్షియల్ చిత్రమని టీజర్, ట్రైలర్ తో అర్థమైంది. దీంతో భారీ అంచానల మధ్య ‘సవ్యసాచి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. ఉదయం పూట ఆట కూడా పడిపోయింది. మరీ.. సవ్యసాచిపై పబ్లిక్ టాక్ ఏంటో.. ? ఓ లుక్కేద్దాం పదండీ.. !
చిత్రబృందం ముందే చెప్పినట్టుగా ఫస్టాఫ్ వినోదాత్మకంగా సాగింది. బ్యాక్ గ్రౌండ్ లో భస్మాసుర స్టోరీ రన్ అవుతుండగా సినిమా మొదలైంది. విక్రమ్ (నాగ చైతన్య) యాడ్ ఫిల్మ్ మేకర్. ఆయన స్నేహితులు గా వెన్నల కిశోర్ , సత్య కనిపించారు. భూమిక చైతూ అక్కగా కనిపించింది. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ గురించి సవివరంగా రావు రమేష్ పాత్రతో చెప్పించారు. హీరో ఎంట్రీ, అతని ఫ్యామిలీ, స్నేహితులు, హీరోయిన్ తో పరిచయం, ప్రేమ.. అంశాలతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోయింది. అదే సమయంలో కథపై ఆసక్తిని పెంచుతూ ఇంటర్వెల్ కు ముందు ఓ ట్విస్టు, మాధవన్ పాత్ర ఎంట్రీ తో సెకాంఢాఫ్ పై అంచనాలని పెంచేశారు.
ఆ అంచనాలకి తగ్గట్టుగానే సెకాంఢాఫ్ సాగింది. చైతూని మాధవన్ కూల్ గా టెన్షన్ పెట్టడం, వీరిమధ్య ఫోన్ సంభాషణ, ఆ తర్వాతి పరిణామాలు ఆకట్టుకొన్నాయి. సుభద్ర పరిణయం అనే కామెడీ ఎపిసోడ్, నిన్ను రోడ్డు మీద రిమేక్ సాంగ్.. ప్రేక్షకుడికి రిలాక్స్ పంచుతాయి. ఇక, క్లైమాక్స్ లో ఓ భారీ యాక్షన్ సీన్ తో సినిమాని ముగించారు. మొత్తంగా ఫస్టాఫ్ లో చైతూ, సెకాంఢాఫ్ లో మాధవన్ హవా కనబడింది. కంటెంట్ తో పాటు దాన్ని వినోదాత్మకంగా చెప్పడంతో ‘సవ్యసాచి’కి పాజిటివ్ టాక్ వినబడుతోంది.