చిట్టి రిలోడెడ్.. వర్షన్ ‘2.O’ !


శంకర్ ‘రోబో’ చిట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మానవ అవసరాల కోసం రెడీ చేసిన చిట్టి.. మానవ సంబంధాలని కోరుకొంది. ఫలితంగా దాన్ని నిర్వీర్యం చేయాల్సి వచ్చింది. ఇప్పుడా చిట్టి రోబో ని రిలోడ్ చేశాడు దర్శకుడు శంకర్. వర్షన్ ‘2.O’ని రెడీ చేశాడు. దాన్ని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని శనివారం విడుదల చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదు.

టీజర్ లో చూపించిన సెల్ ఫోన్ గయాబ్ కావడం సీన్ నే.. ట్రైలర్ ఇంకాస్త డెప్త్ గా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్ రోబో అంతకుమించిన స్థాయిలో ఉన్నాయి. రజనీకాంత్, అక్షయ్ కుమార్ అదరగొట్టేశారు. అది ఏ రేంజ్ లో ఉందో మీరు చూసేయండీ.. !