సానియా మీర్జా కొడుకుని చూశారా ?


షోయబ్ మాలిక్-సానియా మీర్జా దంపతులకి మొదటి సంతానంగా మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30న సానియా డిలివరీ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొంటూ షోయబ్ మురిసిపోయాడు. తనయుడుని ‘మీర్జామాలిక్’గా పేర్కొన్నాడు. ఆ తర్వాత పిల్లాడికి ‘ఇజ్‌హాన్’ అని పేరు పెట్టారు. ‘ఇజ్‌హాన్’ అంటే అరబిక్‌లో ‘దేవుని బహుమతి’, ‘విశ్వమంత ప్రేమ’ అనే అర్థం వస్తుంది.ఆసుపత్రి నుంచి సానియా డిశ్చార్జి కూడా అయ్యింది.

ఆ సమయంలో తీసిన ఫోటోలని షోయబ్ తన ఇన్ స్ట్రోగామ్ లో పోస్టు చేశారు. ఇప్పుడవి వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో పిల్లాడు మొహం కనిపించడం లేదు. దీంతో బాబు ఫస్ట్ లుక్ ఎప్పుడు ? అని నెటిజర్స్ ప్రశ్నిస్తున్నారు. బహుశా.. త్వరలోనే సానియా-మాలిక్ లు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి.. ఆ తర్వాత బాబుని పరిచయం చేస్తారేమో.. ! ఇక సానియా తల్లిగా ప్రమోటైనా.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే పట్టుదలతో సానియా ఉంది.