‘దేవ్’ టీజర్ టాక్

టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో కార్తీ. ఆయన ప్రతి సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు. ‘ఖాకీ’ తర్వాత కార్తీ నటించిన చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకర్ దర్శకుడు. కార్తీకి జంటగా రకుల్ ప్రీత్ సింత్ జతకట్టనుంది. తాజాగా, ఈ సినిమా టీజర్ న్ విడుదల చేసింది చిత్రబృందం. రొమాన్స్, యాక్షన్ సీన్స్ కి పెద్ద పీఠ వేస్తూ టీజర్ ని కట్ చేశారు.

‘ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి.. ఇష్టంలేని ఉద్యోగం చేసి.. ముక్కు మొహం తెలియని ఒక నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పనిచేసి.. ఈగో, ప్రెషర్, కాంపిటేషన్ లో ఇరుక్కుని.. అంటీ అంటనట్టు లవ్ చేసి, ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఒకదారి. ఇంకోదారి వుంది..” అంటూ తనకి నచ్చిన బైక్ రేసింగ్ సీన్ తో కార్తీ దూసుకెళ్లడం టీజర్ లో చూడొచ్చు.

చివరల్లో యాక్షన్ సీన్.. ‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకొని పోతా. వదలక పోతే ? వదలకపోయినా తీసుకుపోతా. ఏంటీ సీనా.. ? కాదు కాన్ఫిడెన్స్. అనే డైలాగ్ బాగా పేలింది. అంతకంటే ముందు కార్తీ-రకుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఒకట్రెండు బిట్స్ సీన్స్ అదిరిపోయాయి. మొత్తంగా.. దేవ్ కాన్ఫిడెంటుగా ఉన్నాడు. మరీ.. రిజల్ట్ ఎలా ఉంటుందన్నది చూడాలి.