క్రికెట్‌ సామ్రాట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. తాజా, మాజీ క్రికెటర్లు కోహ్లీని విష్ చేస్తున్నారు. బీసీసీఐ కూడా కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ధోనీ, జడేజా తదితర క్రికెటర్లు విరాట్‌కు శుభాకాంక్షలు చెబుతున్న ప్రత్యేక వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. భార్య, నటి అనుష్క శర్మ కూడా ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. అతన్ని పుట్టించిన దేవుడికి కృతజ్ఞతలని చెప్పింది. విరాట్ తో కలిసున్న రెండు చిత్రాలను ఫ్యాన్స్ తో పంచుకుంది.

వీరేంద్ర సెహ్వాగ్‌ : ఈ ధనత్రయోదశి (ధంతేరాస్‌) రోజున.. నీ మరో ఏడాది రన్‌తేరాస్‌(పరుగులు)తో నిండిపోవాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే విరాట్‌

వీవీఎస్‌ లక్ష్మణ్‌ : నీ జీవితం మొత్తం విజయం, సంతృప్తితో సాగాలని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు విరాట్‌

సురేశ్‌ రైనా : క్రికెట్‌ సామ్రాట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

మహ్మద్‌ కైఫ్‌ : చేతిలో మ్యాజిక్‌ స్టిక్‌తో ఎలాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా తెస్తున్నాడు. స్థిరత్వానికి అతడే ఓ ఉదాహరణ. పరుగుల ఆకలికి పునర్నివచనం. హ్యాపీ బర్త్‌డే విరాట్‌

వృద్ధిమాన్‌ సాహా : హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌. ఈ సంవత్సరం కూడా మీకు అద్భుతంగా ఉండాలి

మహ్మద్‌ షమీ : పుట్టినరోజు శుభాకాంక్షలు విరాట్‌ కోహ్లీ