అనుష్క కోసం అభిమానుల యజ్ఝం !


స్వీటీ అనుష్క ఆల్ రౌండర్ హీరోయిన్. తొలినాళ్లలో గ్లామర్ తో మెప్పించిన స్వీటీ.. ఆ తర్వాత అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి లాంటి నటనకి స్కోప్ ఉన్న సినిమాలు చేసి మెప్పించింది. ఈ క్రమంలో టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకొంది. స్టార్ హీరోల రేంజ్ లో స్వీటీకి అభిమానులని సంపాదించుకొంది. నేడు (నవంబర్ 7)పుట్టినరోజుని జరుపుకొంటున్న స్వీటీకి అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వరంగల్’లో అభిమానులు స్వీటీకోసం యజ్ఝం నిర్వహించారు.

స్వీటీ కోసం ‘సంపూర్ణ ఆయుష్ హోమం’ జరిపించారు. ‘స్వీటీ అనుష్క ఫ్యాన్స్ & వెల్ఫేర్ సోసైట్’ ఈ హోమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన పిక్ ని తళ్లూరి వరుణ్ తేజ ట్విట్ చేశారు. దీన్ని స్వీటీ అనుష్క రిట్వీట్ చేయడం విశేషం. ఇప్పుడీ హోమం పిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్వీటీని అభిమానులు ఎంతగా అభిమానిస్తున్నారో ఈ పిక్ చెబుతోంది.
ఇక, ‘భాగమతి’ స్వీటీ అనుష్క నటించే సినిమా ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. పలు సినిమాలో అనుష్క నటించబోతుందని వార్తలొచ్చినా.. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు. మరోవైపు, స్వీటీ పెళ్లిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతుందని చెప్పుకొంటున్నారు. ఇటీవల ఆకులని కాలీ మెట్టెలుగా పెట్టుకొని తీసుకొన్న ఫోటో ఒకటి అనుష్క సోషల్ మీడియాలో పంచుకోవడంతో.. ఆమె పెళ్లి ప్రచారంపై మరింత ఊపందుకొంది.