‘సర్కార్’ తొలిరోజు.. బాలీవుడ్ రికార్డులు బ్రేక్ !


మురగదాస్-విజయ్ కలిస్తే ఎట్టుట్టదో మరోసారి రుజువైంది. వీరి కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘సర్కార్’. దీపావళీ కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. పండగ పూట విజయ్ అభిమానుల ఆనందాన్ని డబుల్ చేసింది. అంతేకాదు.. తొలిరోజునే రికార్డులకి తెరలేపింది. ఏకంగా బాలీవుడ్ రికార్డులనీ బద్దలు కొట్టింది. తొలి రోజు రూ. 35కోట్లని రాబట్టింది. ఈ క్రమంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సంజు’ తొలిరోజు కలెక్షన్స్ రికార్డుని బద్దలు బ్రేక్ చేసింది. ఈ మేరకు ట్రేడ్ వర్గాలు చేసిన ట్విట్ ని దర్శకుడు మురగదాస్ రీట్విట్ చేశాడు.

ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ జతకట్టింది. వరలక్ష్మీ కీలక పాత్రలో నటించింది. ఆమె హీరోకి సరైన అపోజిట్ పాత్రలో నటించి మెప్పిచింది. ఒక ఓటును ఎవరైనా దొంగతనంగా వేసేస్తే ఆ హక్కును తిరిగి సంపాదించుకోవచ్చనేది చాలా మందికి తెలియదు. ఐతే, వాటిని కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు ఈజీగా చెప్పగలిగాడు. మొత్తానికి.. విజయ్ అభిమానులని అలరించే అన్ని అంశాలని చూపించాడు. దాంతో పాటు కథ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా తీయడంలో విజయవంతం అయ్యారు. ఫలితంగా సర్కార్ తొలి రోజు నుంచే రికార్డులకి తెరలేపింది. ముందు ముందు సర్కార్ ఖాతాలో ఎన్ని రికార్డులు పడతాయో చూడాలి