తమన్నా కుర్రాళ్లని కోరుకుంటోంది

సీనియర్ హీరోయిన్ లు సీనియర్ హీరోలతో జతకట్టేందుకు ఇష్టపడటం లేదు. వాళ్లు కుర్ర హీరోలని కోరుకొంటున్నారు. ఆ కోరికతో కాజల్ వరుసగా యంగ్ హీరోలతో నటించేందుకు ప్లాన్ చేసుకొంది. ఇప్పుడీ లిస్టులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది. ఆమె యంగ్ హీరో సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తోంది.

ఈ చిత్రానికి బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ కి ‘నెక్ట్స్‌ ఏంటి’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో నవదీప్, పూనమ్ కౌర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం తమన్నా అభినేత్రి2, f2, దటీజ్‌ మహాలక్ష్మి సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్’లో ఆమె ‘ఖామోషీ’ సినిమాలో నటిస్తున్నారు.