కాంగ్రెస్ ఊహించిందే జరుగుతోంది !


తెలంగాణ కాంగ్రెస్ ఊహించినదే జరుగుతోంది. ఆ పార్టీ భావించినట్టుగా సొంత పార్టీ నేతలే దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవడికి వాడే కింగ్ అన్న సంగతి తెలిసిందే. ఎవరిని ఎవరు కంటోల్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే అభ్యర్థుల ఎంపిక తర్వాత సొంత పార్టీ నేతల నుంచి దాడులని ముందే ఊహించింది అధిష్టానం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ గాంధీ భవన్ తో పాటు టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆయన ఇంటి వద్ద కూడా భద్రత పెంచారు. ఇప్పుడా పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి.

వాటిని ఇంకా అధికారికంగా బయటపెట్టకపోయినా.. లీకుల ద్వారా అభ్యర్థుల పేర్లు బయటికొచ్చాయి. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం టికెట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ జనసమితి (టీజేఎస్) కేటాయించిందన్న న్యూస్ బయటికొచ్చింది. దీంతో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ని ముట్టడించారు. కోదండరాం డౌన్ డౌన్, టీజేఎస్ నశించాలి, మల్కాజిగిరి సీటును శ్రీధరన్నకే కేటాయించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ మంచి బలముంది

మల్కాజిగిరి స్థానాన్ని నందికంటి శ్రీధర్ కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాకాదని ఆ స్థానాన్ని టీజె ఎస్ కి కేటాయిస్తే.. అది కచ్చితంగా టీఆర్ ఎస్ కు ప్లస్ అవుతుంది. అక్కడ టీఆర్ ఎస్ గెలుస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని.. నందికంటి శ్రీధర్ కి మల్కాజిగిరి టికెట్ ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరీ.. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం స్పందిస్తుందా.. ? అదికాకుండా.. గాంధీభవన్ ని ముట్టడించిన శ్రీదర్ పై ఏమైనా చర్యలు తీసుకొంటుందా ? అనేది చూడాలి.