ఏపీపై ఆపరేషన్-బి : టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ దాడులు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిపై కేంద్రం కక్ష గట్టింది. ఇందులో భాగంగా ఏపీపై కేంద్రం ‘ఆపరేషన్ గరుడ’ని ప్రయోగించబోతుందని గతంలో సినీ నటుడు శివాజీ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అది నిజమే అన్నట్టు పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఇప్పుడిదే తరహా ఏపీపై కేంద్రం మరో ఆపరేషన్ ప్రారంభించబోతుందట. అదే ఆపరేషన్ – బి. ఇక్కడ బి ఫర్ చంద్రబాబు అని చెబుతున్నాడు ప్రముఖ టాలీవుడ్ దర్శక-నిర్మాత తమ్మారెడ్ది భరద్వాజ.

తనకి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారమ్ ఇది. ఆపరేషన్ -బి లో భాగంగా ఏపీలో టీడీపీకి చెందిన 30మంది ఎంపీలు, ఎమ్మెల్యేలని దొంగలకి చూపేందుకు వారిపై ఐటీ, ఈడీ దాడులు జరగనున్నాయి. అవి కూడా రేపటి నుంచి 15రోజుల్లోగా జరుగుతాయని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. ఏపీలో భయానక పరిస్థితులు నెలకొనేలా చేయబోతున్నారు. దాడులు జరగబోతున్న లిస్టులో సీఎం చంద్రబాబు సన్నిహితులు, స్నేహితులు, గుంటూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాలకు ముఖ్యనేతలు ఉండబోతున్నారంట. శివాజీ బయటపెట్టిన ఆపరేషన్ గరుడ మాదిరిగా ఆపరేషన్ – బి కూడా నిజమవుతుందేమో చూడాలి.